For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. డాలర్‌ బాగా పెరగడంతో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అంతర్గతంగా ఫండ్‌ మేనేజర్లు ఈక్విటీ మార్కెట్ల భవష్యత్తు గురించి చర్చిస్తున్నారు. అమెరికా జాబ్‌ డేటా పటిష్ఠంగా ఉండటంతో పరిస్థితి కరెన్సీ మార్కెట్లు ముఖ్యంగా డాలర్‌ బాగా పెరుగుతోంది. పైగా చైనా ఆర్థిక వ్యవస్థ చల్లబడుతోంది. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిసింది. లాభానష్టాల్లో పెద్ద మార్పు లేదు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా డల్‌గా ఉన్నాయి. సూచీల్లో పెద్దగా మార్పులు లేవు. అయితే చాలా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 25 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన చూస్తే నిఫ్టి ఓపెనింగ్‌ స్థిరంగా ఉండొచ్చు.