ఇటీవలి లాభాలన్నీ పాయే…
వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడ్ తీసుకు్న నిర్ణయం తరవాత ప్రపంచ మార్కెట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి. పావు శాతం వడ్డీ రేటు పెంపును మార్కెట్ అప్పలికే డిస్కౌంట్ చేయడమే దీనికి ప్రధాన కారణం. అయితే మన మార్కెట్లు మాత్రం ఇవాళ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీనికి కారణం… ఇన్వెస్టర్లు కీలక రంగాల్లో లాభాలను స్వీకరించడమే. ముఖ్యంగా ఐటీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో లాభాలను స్వీకరించడంతో నిఫ్టి 118 పాయింట్లు క్షీణించి 19700 దిగువన అంటే 19659 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవలి కాలంలో సూచీ ఆర్జించిన లాభాలన్నీ ఇవాళ పోయాయి. ఇవాళ వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కావడం, చివరి గంటలో ట్రేడింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో… నిఫ్టిపై ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది ఇన్వెస్టర్లు తమ లాంగ్ పొజిషన్స్న అన్ వైండ్ చేయడం ప్రాధాన కారణంగా బ్రోకర్లు చెబుతున్నారు. ఆర్బీఎల్ బ్యాంక్లో వాటా తీసుకుందన్న వార్తలతో ఇవాళ ఎం అండ్ ఎం కౌంటర్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అలాగే ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో టెక్ మహీంద్రాపై కూడా ఒత్తిడి జోరుగా ఉంది. ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు కూడా ఒకటి నుంచి మూడు శాతం మేర నష్టపోయాయి. అయితే ఇవాళ ఫార్మా షేర్లు చెలరేగిపోయాయి. అద్భుత ఫలితాలు ప్రకటించిన సిప్లా షేర్ పది శాతం లాభంతో ముగిసింది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా వంటి షేర్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో ఒకదశలో 4 శాతం నష్టపోయిన లారస్ ల్యాబ్… ట్రేడింగ్ ముగిసే సయమానికి నష్టాలను కవర్ చేసుకుంది.