For Money

Business News

నిఫ్టికి మరి కొంత గడ్డుకాలం?

నిఫ్టి ఇవాళ ఇన్వెస్టర్లకు చిన్న పాటి షాక్‌ ఇచ్చింది. ఇటీవల వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. జులై సిరీస్‌ షాక్‌ ఇస్తూ ముగిసింది. నిఫ్టికి అత్యంత కీలకమైన 19600 స్థాయిని ఇవాళ కాపాడుకోవడమే ప్రధాన ప్లస్‌ పాయింట్‌. నిఫ్టి ఈ స్థాయి వద్ద నిలదొక్కుకుంటేనే ముందుకు సాగే అవకాశముంది. అమెరికా జీడీపీ బ్రహ్మాండంగా పెరగడంతో అమెరికా మార్కెట్లు ఉరకలు పెడుతున్నాయి. అయితే నిఫ్టికి 19800 లేదా 19850 స్థాయిలు ప్రధాన ప్రతిబంధకంగా పనిచేస్తాయని అంటున్నారు స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు. ఏంజిల్‌ వన్‌ బ్రోకింగ్ సంస్థకు చెందిన టెక్నికల్‌ అనలిస్ట్‌ రాజేష్‌ భోంస్లే… ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికతో మాట్లాడుతూ .. నిఫ్టి 20 రోజలు EMA ప్రధాన మద్దతుగా ఉంటుందని అన్నారు. అంటే 19500 స్థాయి ప్రధాన మద్దతు స్థాయి అన్నమాట. మే, జూన్‌ నెలలో వచ్చిన కరెక్షన్‌ సమయంలో కూడా ఈ స్థాయి గట్టిగా నిలిచింది. రానున్న ఈ సెషన్స్‌లో ఈ స్థాయిని కోల్పోతే మరింతగా లాభాల స్వీకరణ ఉంటుందని ఆయన అంటున్నారు. లేని పక్షంలో నిఫ్టి 19850 లేదా 19880 స్థాయిని తాకుంతుందని పేర్కొన్నారు. ఈ స్థాయిని బలంగా బ్రేక్‌ చేస్తేనే గట్టి అప్‌ట్రెండ్‌కు ఛాన్స్‌ ఉందని అన్నారు. కాబట్టి ప్రస్తుత స్థాయిలో తొందరపడి కొనుగోలు చేయడంకన్నా.. కన్సాలిడేషన్‌ తరవాత కొనుగోలు చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు.