For Money

Business News

ఎక్స్ఛేంజీలో సాంకేతిక సమస్యలు

ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ట్రేడింగ్‌ సమయంలో ట్రేడర్లు ఇబ్బంది పడుతున్నాయి. ఖాతాల్లో తాము జమ చేసిన మార్జిన్‌ మొత్తం డెబిట్‌ లేదా క్రెడిట్‌ కన్పించడం లేదని చాలా మంది బ్రోకర్లు తెలిపారు. ముఖ్యంగా అకౌంట్లలో మార్జిన్‌ డిపాజిట్‌ కన్పించడం లేదు. రెండు నుంచి రెండున్నర గంటల మధ్య ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఇవాళ జులై వారపు, నెలవారీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడం కూడా విశేషం. దీంతో ట్రేడింగ్‌ సమయంలో ఇబ్బందులతో ఇన్వెస్టర్లు కంగారు పడుతున్నారు. దీంతో మార్జిన్‌ ట్రేడింగ్‌ క్లోజింగ్ సమయానికి 2.50 గంటల నుంచి 3.30 గంటలకు పొడిగించినట్లు తెలుస్తోంది.