For Money

Business News

మైక్రోసాఫ్ట్‌ సూపర్‌ పనితీరు కాని…

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ విశ్లేషకుల అంచనాలకు మించిన పనితీరు కనబర్చింది. ఈ మూడు నెల్లో 5,544 కోట్ల డాలర్ల ఆదాయంపై 2.55 డాలర్ల ఈపీఎస్‌ను మైక్రోసాఫ్ట్‌ ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కంపెనీ 5620 కోట్ల ఆదాయంపై 2.69 డాలర్ల ఈపీఎస్‌ను ప్రకటించింది. క్లౌడ్‌ బిజినెస్‌ 15 శాతం పెరిగి 2400 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ పనితీరు బాగున్నా… ఆర్టిఫిషియల్‌ ఎంటెలిజెన్స్‌పై భారీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని చెప్పడంతో పాటు మున్ముందు వృద్ధి రేటు మందిగిస్తుందని కంపెనీ యాజమాన్యం ప్రకటించడంతో… షేర్‌ నాలుగు శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ నుంచి భారీ లాభాలు పొందాలంటే… ముందుగా అత్యంత భారీ పెట్టుబడులు అవసరమని మైక్రోసాఫ్ట్‌ అంటోంది.