19750పైన ముగిసిన నిఫ్టి
బుల్స్ మళ్ళీ తమ సత్తా చూపారు. ఫెడ్ నిర్ణయం మరికొన్ని గంటల్లో వెలువడ నుండగా.. మార్కెట్ కీలకమైన 19750 స్థాయి పైన ముగిసింది. ఉదయం 19716 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి క్రమంగా కోలుకుంటూ మిడ్ సెషన్ ముందు 19825 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివర్లో కాస్త ఒత్తిడి వచ్చినా 97 పాయింట్ల లాభంతో రూ. 19778 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొన్ని రోజుల నుంచి పడుతూ వచ్చిన ఐటీసీకి ఇవాళ మద్దతు లభించింది. అలాగే చక్కటి ఫలితాలు ప్రకటించిన ఎల్ అండ్ టీ కూడా మూడున్నర శాతం లాభ పడింది. సిప్లా, బ్రిటానియా, సన్ ఫార్మా నుంచి వచ్చిన మద్దతుతో నిఫ్టి అమ్మకాల ఒత్తిడిని తట్టుకోగలిగింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్, టెక్ మహీంద్రా షేర్లు ఒక శాతంపైగా నష్ఠంతో ముగిశాయి. ఇవాళ బ్యాంక్ షేర్లు కూడా బాగా లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టి అర శాతం దాకా లాభపడింది. నిఫ్టి నెక్ట్స్‌లో ఇవాళ ఇండస్ టవర్, అదానీ ఎనర్జి, శ్రీ సిమెంట్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మిడ్ క్యాప్‌లో బాలకృష్ణ ఇండస్ట్రీ 5 శాతం పైగా లాభపడగా, పీఎన్బీ నాలుగు శాతం లాభపడింది.