For Money

Business News

ఎల్‌&టీ నుంచి తొలి షేర్ల బైబ్యాక్‌

రూ.10,000 కోట్ల విలువైన షేర్లను టెండర్‌ ఆఫర్‌ పద్ధతిలో బైబ్యాక్‌ చేయాలని ఎల్‌&టీ ప్రతిపాదించింది. కంపెనీ చరిత్రలో షేర్ల బైబ్యాక్‌ చేయడం ఇదే మొదటిసారి. బైబ్యాక్‌ కింద 3.33 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.3,000 ధర చొప్పున కంపెనీ కొనుగోలు చేయనుంది. బైబ్యాక్‌ చేయనున్న షేర్లు కంపెనీ ఈక్విటీలో 2.37% వాటాకు సమానం. 2019లో రూ.9,000 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ చేపట్టాలని కంపెనీ ప్రతిపాదించినా… సెబీ సదరు ప్రతిపాదనను తిరిస్కరించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌- జూన్‌) ఎల్‌అండ్‌టీ రూ.3,116.12 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.2,293.01 కోట్లతో పోలిస్తే ఇది 36% అధికం. అలాగే కంపెనీ టర్నోవర్‌ రూ.36,547.92 కోట్ల నుంచి రూ.49,027.93 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.6 ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ చెల్లించనుంది.