For Money

Business News

NIFTY: డే ట్రేడర్స్‌కు కాసుల వర్షం

నిఫ్టి ఇవాళ డే ట్రేడర్స్‌కు మంచి అవకాశం ఇచ్చింది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16,320 పాయింట్లకు వెళ్ళి… డే ట్రేడర్స్‌కు మంచి షార్టింగ్‌ ఆప్షన్‌ ఇచ్చింది. ఈ ప్రాంతంలో షార్ట్‌ చేసిన ట్రేడర్స్‌కు మిడ్‌ సెషన్‌ తరవాత భారీ లాభాలు వచ్చాయి. అమెరికా ఫ్యూచర్స్‌తోపాటు ప్రధాన యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటంతో నిఫ్టి 16,179ని తాకింది. అంటే గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 140 పాయింట్లు క్షీణించింది. ఉదయం అనుకున్నట్లు 16,180 ప్రాంతంలో మద్దతు లభించడంతో మళ్ళీ పెరిగి 16,258 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 20 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి ఒక మోస్తరు లాభాలు పొందినా.. ఇతర షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నిఫ్టి క్షీణించింది. నిఫ్టి మళ్ళీ 16,250పైకి తీసుకెళ్ళిగలిగారు… కాని మార్కెట్‌లో భారీ అమ్మకాలు జరిగాయి. సూచీలు పైకి, షేర్ల ధరలు దిగువకి అన్న రీతిలో అమ్మకాలు సాగడంతో మిడ్ క్యాప్‌ సూచీ ఏకంగా 1.3 శాతం క్షీణించింది. నిఫ్టి నెక్స్ట్‌ 50 కూడా 0.46 శాతం తగ్గింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎం అండ్‌ ఎం 775.15 2.23
టెక్‌ మహీంద్రా 1,289.00 1.93
యాక్సిస్‌ బ్యాంక్‌ 754.60 1.86
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 14,225.00 1.57
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,043.00 1.31

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా కన్జూమర్‌ 765.90 -1.98
కోల్‌ ఇండియా 143.40 -1.85
అదానీ పోర్ట్స్‌ 698.85 -1.67
భారతీ ఎయిర్‌టెల్‌ 598.00 -1.63
ఎస్‌బీఐ లైఫ్‌ 1,132.00 -1.63