For Money

Business News

కుప్పకూలిన క్రూడ్‌, బంగారం

చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరగడం, దరిమిలా ప్రయాణ ఆంక్షలు విధించడంతో చమురు ధరలు గణనీయంగా క్షీణించాయి. గత నెలలో 77 డాలర్ల వరకు వెళ్ళి బ్యారెల్‌ చమురు ధర ఇవాళ 67.88 డాలర్లకు పడిపోయింది. ఈ ఒక్క రోజే క్రూడ్‌ 4 శాతం పైగా క్షీణించింది. డాలర్‌ ఇవాళ స్థిరంగా ఉంది. అయినా బులియన్‌ మార్కెట్‌లో భారీగా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1744 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర ఒక శాతం క్షీణించగా, వెండి ధర దాదాపు రెండు శాతం క్షీణించింది.