స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. రేపు, ఎల్లుండి అమెరికా ఫెడరల్ రిజర్వే భేటీ ఉన్న నేపథ్యంలో మార్కెట్లో హడావుడి లేదు. ఫెడరల్ రిజర్వ్ ఈ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచుతుందా? లేదా వాయిదా వేస్తుందా అన్న అంశంపై టెన్షన్ ఉంది. గత శుక్రవారం మార్కెట్ స్థిరంగా ముగిసింది. సూచీల్లో పెద్ద మార్పులు లేవు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తమౌతోంది. జపాన్ నిక్కీ భారీ లాభాల్లో ఉండగా, హాంగ్‌సెంగ్ ఒకటిన్నర శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… నామ మాత్రమే.ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. 19704 పాయింట్లని తాకినా.. వెంటనే కోలుకుని ఇపుడు 19738 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో౮ పోలిస్తే నిఫ్టి 6 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంకు షేర్లు ఇవాళ పటిష్ఠంగా ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో స్వల్ప ఒత్తిడి ఉన్నా… నిఫ్టి నెక్ట్స్ క్రితం ముగింపు వద్దే ఉంది. నిఫ్టిలో 32 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఎం అండ్ ఎం టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆకర్షణీయ లాభాలు ప్రకటించినా… కోటక్ మహీంద్రా బ్యాంక్ రెండున్నర శాతం లాభంతో ఉంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే దీనికి కారణం. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో రిలయన్స్ షేర్ కూడా రెండున్నర శాతం నష్టంతో ఉంది.