లాభాల స్వీకరణతో 16,300 దిగువకు
ఆర్బీఐ పాలసీపై మార్కెట్‌కు పెద్ద ఆశల్లేవ్. అందుకే అలా వచ్చి.. ఇలా వెళ్ళి పోయింది. ద్రవ్యోల్బణం 5.7 శాతం ఉంటుందని చేసిన హెచ్చిరిక మినహా… ఇవాళ్టి క్రెడిట్ పాలసీలో ఏమీ లేదు. క్రెడిట్ పాలసీకి ముందు 16,336 పాయింట్లకు చేరిన నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి వద్ద వెనక్కి మళ్ళింది. అక్కడి నుంచి దాదాపు వంద పాయింట్లు అంటే 16235కు క్షీణించింది. అక్కడి నుంచి కోలుకుని 16,261 వద్ద 33 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఐటీ, మెటల్స్‌లో ఇవాళ కూడా మద్దతు కొనసాగింది. బ్యాంక్ నిఫ్టి స్వల్ప నష్టంతో ముగిసింది. అలాగే మిడ్ క్యాప్ సూచీ కూడా. డే ట్రేడర్స్‌కు ఇవాళ మంచి లాభాలే వచ్చాయి. లాభాలు ప్రకటించిన షేర్లలో కొన్ని భారీగా లాభాలు పొందగా, కొన్నింటిలో లాభాల స్వీకరణ జరిగింది. రిలయన్స్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో ఆ కంపెనీ షేర్‌తో పాటు ఫ్యూచర్స్ గ్రూప్ కంపెనీల షేర్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
అదానీ పోర్ట్స్ 713.20 2.83
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,019.40 2.18
ఐఓసీ 105.95 1.92
టాటా కన్జూమర్స్ 782.80 1.88
టెక్ మహీంద్రా 1,269.80 1.73
నిఫ్టి టాప్ లూజర్స్
సిప్లా 912.60 -3.47
రిలయన్స్ 2,089.65 -2.09
అల్ట్రాటెక్ సిమెంట్ 7,527.70 -1.71
శ్రీ సిమెంట్ 28,501.00 -1.61
నెస్లే ఇండియా 17,999.95 -1.15