For Money

Business News

పాపులర్‌ వెహికల్స్‌ ఐపీఓ

పాపులర్ వెహికిల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్..త్వలరోనే క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించనుంది. ఐపీఓకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను సెబీకి దాఖలు చేసింది. రూ. 150 కోట్ల విలువైన కొత్త షేర్లను ఇష్యూతో పాటు ఇపుడున్న ఇన్వెస్టర్లు కొందరు ఆఫర్ ఫర్ సేల్ కింద ఈక్విటీని ఆఫర్‌ చేస్తున్నారు. బనియన్‌ ట్రీ గ్రోత్ క్యాపిటల్ II, ఎల్‌ఎల్‌సీ ద్వారా 42.7 లక్షల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి సంస్థలో 34 శాతం వాటా ఉంది. ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను కంపెనీ… రుణాలను తీర్చేందుకు వినియోగించనుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ. 2.895 కోట్ల ఆదాయంపై రూ. 32.45 కోట్ల నికర లాభం వచ్చింది. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 59 ఆటోమేటివ్‌ డీలర్‌షిప్‌లు ఉన్నాయి. 99 సేల్స్‌ ఆఫీస్‌లు ఉన్నాయి. 83 ఆధీకృత సర్వీస్‌ సెంటర్లు ఉన్నాయి.