రీటైల్ ద్రవ్యోల్బణం షాక్
రీటైల్ ద్రవ్యోల్బణం మరోసారి అంచనాలకు మించి దూసుకుపోయింది. జవనరి నెలలో 6.25 శాతానికి చేరింది. ఇది మూడు నెలల గరిష్ట స్థయాఇ. ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం లోగా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్వప్రయత్నం చేస్తున్నా… ఫలితం ఇవ్వడం లేదు. డిసెంబర్లో ఇది 5.72 శాతంగా నమోదుగా కాగా.. జనవరిలో 0.80 శాతం పెరిగి 6.25 శాతానికి చేరిందని కేంద్ర స్టాస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ వెల్లడించింది. దేశంలో నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, కూరగాయాల ధరలు బాగా పెరగడమే రీటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం. 10 నెలల తర్వాత గతేడాది నవంబర్లో ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగివచ్చింది. డిసెంబర్లో 5.72 శాతానికి చేరింది. ద్రవ్యల్బోణం కుదట పడటంతో… ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు స్వస్తి పలికే అవకాశముందని ఆర్థిక వేత్తలు, బ్యాంకులు భావించారు. అయితే వీరి అంచాలను తలకిందులు అయ్యాయి. ఇటీవలే రెపో రేటును 0.25శాతం మేర పెంచింది ఆర్బీఐ. ఇలా రెపో రేటును వరుసగా పెంచడం ఇది ఆరోసారి.