నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయాయి. నాస్డాక్ నామమాత్రపు లాభాలకు పరిమితమైంది. మిగిలిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిన్న భారీ లాభాల్లో ముగిసిన ఆసియా షేర్లు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌తో పాటు హాంగ్ కాంగ్ మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లలో ఒత్తిడి ఇంకా కొనసాగుతోంది. డాలర్ స్థిరంగా ఉంది. సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టాలతో ఉంది. 40 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కావొచ్చు. క్రూడ్ ధరలు రాత్రి ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి స్థిరంగా ఉన్నాయి.