ఒకశాతం నష్టంతో నిఫ్టి
గత కొన్ని రోజులుగా మార్కెట్‌కు మద్దతుగా ఉన్న మెటల్స్, బ్యాంక్ షేర్లు ఇవాళ నిఫ్టికి హ్యాండిచ్చాయి. దీంతో నిఫ్టితో ప్రధాన సూచీలన్నీ ఒక శాతం వరకు నష్టంతో ముగిశాయి. మార్కెట్‌కు అత్యంత కీలక స్థాయి అయిన 18068 దిగువన నిఫ్టి క్లోజ్ కావడం గమనార్హం. చివరల్లో 18020కి పడిపోయిన నిఫ్టి 18042 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 189 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్ 1.35 శాతం నష్టపోయింది. ఇవాళ ఒక శాతం లాభపడిన దివీస్ ల్యాబ్ నంబర్ వన్ నిఫ్టి గెయినర్‌గా నిలిచింది. ఇక మెటల్స్ షేర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో నాలుగు శాతంపైగా నష్టపోయాయి. అలాగే టాటా స్టీల్ 2.5 శాతం తగ్గింది. జొమాటొ ఇవాళ మరో 4.4 శాతం క్షీణించడం విశేషం. యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నా మన మార్కెట్లు పట్టించుకోలేదు.