For Money

Business News

బంగారం రూ. 56,010

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్‌ల్‌ ఔన్స్‌ బంగారం ధర1864 డాలర్లకు చేరగా, వెండి 24.23 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. మనదేశంలో ఫార్వర్డ్‌ మార్కెట్‌లో బంగారం పది గ్రామల ధర ఫిబ్రవరి కాంట్రాక్ట్‌ 56010ని తాకగా, వెండి కిలో మార్చి కాంట్రాక్ట్‌ రూ. 70784ని తాకింది. నిన్నటి ధరతో పోలిస్తే బంగారం 355 పెరగ్గా, వెండి రూ. 103 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌ 0.32 శాతం తగ్గింది.