లాభాల్లోకి వచ్చిన నిఫ్టి
మార్కెట్ పూర్తిగా ఆల్గో లెవల్స్‌ను ఫాలో అవుతోంది. ఉదయం మార్కెట్ అనలిస్టులు అంచనా వేసినట్లు దిగువ ప్రాంతంలో మద్దతు తీసుకున్న నిఫ్టి నష్టాలన్నింటిని పూడ్చుకుని లాభాల్లోకి వచ్చింది. వాస్తవానికి నిఫ్టి 18000 స్థాయిని విజిట్ చేస్తుందని అనుకున్నా… దానికన్నా ముందు గరిష్ఠ స్థాయి 18152ను తాకింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇక యూరో మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తం అవుతోంది. అయితే మన మార్కెట్లలో రేపు వీక్లీతో పాటు మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉండటంతో…కాల్, పుట్స్‌ను బట్టి నిఫ్టి కదలాడే అవకాశాలే అధికంగా ఉన్నాయి. నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి తాకిన పక్షంలో… క్లోజింగ్ లోపల 18000 స్థాయిని తాకుతుందా లేదా ఈ లాభాలను నిలబెట్టకుంటుందా అన్నది చూడాలి. చాలా రోజుల తరవాత టైటాన్ మూడు శాతంపైగా పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్, పేటీఎం షేర్లు ఇవాళ మూడు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. మిడ్ క్యాప్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు మద్దతు ఇవాళ కూడా కొనసాగుతోంది. అలాగే ఫర్టిలైజర్ షేర్లకు కూడా.