For Money

Business News

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ షేర్‌ కొనండి

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ షేర్‌ ఇవాళ 2.85 శాతం పెరిగి రూ. 717ను తాకింది. ఈనెల 23 నుంచి ఈ షేర్‌ ఇప్పటి వరకు 9.24 శాతం పెరిగింది. ఈ ఏడాది జులైలో రూ. 584ను తాకిన ఈ షేర్‌ అప్పటి నుంచి 22.62 శాతం పెరిగింది. ఏడాది కాలానికి ప్రస్తుత ధర వద్ద ఈ షేర్‌ను రూ. 920 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రెకమండ్‌ చేసింది. మున్ముందు కంపెనీ మార్జిన్స్‌ పెరిగే ఛాన్స్‌ ఉందని ఈ బ్రోకరేజీ సంస్థ అంచనా వేస్తోంది. స్వల్ప కాలానికైతే ఈ షేర్‌ రూ. 759 లేదా రూ. 815కు చేరే అవకాశముందని టిప్స్‌2ట్రేడ్స్‌ సంస్థకు చెందిన అనలిస్ట్‌ ఏఆర్‌ రామచంద్రన్‌ సలహా ఇస్తున్నారు.ఒకవేళ పడితే ఈ షేర్‌కు రూ. 658 వద్ద మద్దతు అందుతుందని పేర్కొన్నారు. ఈ షేర్‌కు రూ. 718, రూ. 759, రూ. 815 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని వెల్లడించారు. ప్రస్తుతం తాన్లా కంపెనీ యాజమాన్యం 14,16,666 షేర్లను రూ. 1200 ధరకు బైబ్యాక్‌ చేస్తోంది. ఈ బైబ్యాక్‌ ఆఫర్‌ ఈనెల 20న ప్రారంభమైంది. జనవరి 2వ తేదీన ముగియనుంది.