అప్ 234, డౌన్ 2519
మార్కెట్లో సూచీలకన్నా షేర్లలో తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. ఫార్మా, డయాగ్నస్టిక్ రంగానికి చెందిన షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టి ఒకదశలో 17965ని తాకింది. నిఫ్టిలో మొత్తం 234 షేర్లు గ్రీన్లో ఉండగా, 2519 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ అధికంగా కన్పిస్తోంది. ఆల్గొ ట్రేడింగ్ ప్రకారం నిఫ్టికి 17950పైన ప్రస్తుతానికి మద్దతు లభించింది. 17965ని తాకిన తరవాత నిఫ్టి ఇపుడు 18025 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడ్ అవుతోంది. చాలా షేర్లు దిగువ స్థాయి నుంచి కోలుకుంటున్నాయి. ఇక ఫార్మా షేర్లలో సిప్లా, దివీస్ టాప్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్ ఇవాళ రూ. 3474ని తాకిన తరవాత ఇపుడు రూ. 3551 వద్ద ట్రేడవుతోంది. రూ. 3600ని క్రాస్ చేస్తుందని పలువురు టెక్నికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.