For Money

Business News

అడ్వెంట్‌ చేతికి సువేన్‌ ఫార్మా?

హైదరాబాద్‌కు చెందిన సువేన్‌ ఫార్మాను అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ టేకోవర్‌ చేయనుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ కొనేందుకు అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్‌ ముందుంది. ఫైనల్‌గా అడ్వెంట్‌ సువేన్‌ ఫార్మాను కొనుగోలు చేయనుంది. ఇది లిస్టెడ్‌ కంపెనీ. సువన్‌ లైఫ్‌ సైన్సస్‌ను విడిదీసి CRAMS వ్యాపారాన్ని మరో లిస్టెడ్‌ కంపెనీకి ప్రమోటర్లు జాస్తి వెంకటేశ్వర్లు బదిలీ చేశారు. దీంతో ఇపుడు రెండు కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఇందులో సువేన్‌ ఫార్మా కంపెనీ వ్యాల్యూయేషన్‌ రూ. 12,279 కోట్లుగా తేలింది. ఇందులో ప్రమోటర్లకు 60 శాతం వాటా ఉంది. కంపెనీలో మెజారిటీ వాటా అంటే 51 శాతానికి అడ్వెంట్‌ కొనుగోలు చేస్తుంది. మిగిలిన 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ చేయనుంది. ఇవాళ సువేన్‌ ఫార్మా షేర్‌ 4 శాతం పైగా పెరిగి రూ. 503 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సువేన్‌ లైఫ్ సైన్సస్‌ షేర్ కూడా 7.51 శాతం పెరిగి రూ. 65.85 వద్ద ట్రేడవుతోంది.