For Money

Business News

రూ.4000 కోట్ల బ్యాంక్‌ స్కామ్‌… సీబీఐ దాడులు

కోల్‌కతాకు చెందిన కార్పొరేట్‌ పవర్‌ లిమిటెడ్‌కు చెందిన 16 ఆఫీసులపై సీబీఐ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. బ్యాంకులకు సమారు రూ. 4037.87 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన కేసులో ఈ దాడులు జరుగుతున్నాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియంలో 20 బ్యాంకులు ఈ కంపెనీకి రుణాలు వచ్చాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై, నాగ్‌పూర్, కోల్‌కతా, రాంచి, దుర్గాపూర్, విశాఖపట్నం, ఘజియాబాద్‌లలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. అభిజిత్‌ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి మనోజ్‌ జైశ్వాల్‌ ఛైర్మన్‌ కాగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా అభిషేక్‌ జైశ్వాల్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి వీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు సీబీఐ పేర్కొంది. 2009 నుంచి 2013 మధ్యకాలంలో బ్యాంకులు ఈ రుణాలు మంజూరు చేశాయి.