For Money

Business News

17851ని తాకిన నిఫ్టి

నిఫ్టి కీలక మద్దతు స్థాయిలను కోల్పోతోంది. ఉదయం 18950 ప్రాంతంలో మద్దతు లభిస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు భావించినా… నిఫ్టి 17851ని తాకింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయితో పోలిస్తే 200 పాయింట్లు క్రితం ముగింపుతో పోలిస్తే 275 పాయింట్లు నిఫ్టి క్షీణించింది. ప్రస్తుతం 266 పాయింట్ల నష్టంతో 17860 వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు డల్‌గా ప్రారంభమైనా.. నష్టాల నుంచి కోలుకుని.. స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. క్రిస్మస్‌ సెలవుల కారణంగా పెద్ద ట్రేడింగ్‌ పరిమాణం లేదు. పైగా ఏడాది చివర్లో ఖాతాల ముగింపు కారణంగా పలు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఉదయం భారీ లాభాలు ఆర్జించిన ఫార్మా షేర్లు కూడా చాలా వరకు లాభాలు కోల్పోయాయి. దివీస్‌ ల్యాబ్‌ రూ. 3640 నుంచి రూ. 3539కి పడిపోయింది. నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి కన్నా.. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ షేర్లు రెండున్నర నుంచి మూడు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన షేర్ల ఇపుడు చాలా జోరుగా పడుతున్నాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు పడ్డాయి. అదానీ గ్రూప్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది.