పీవీఆర్ నష్టం రూ.220 కోట్లు
ఎంటర్టైన్మెంట్ రంగం కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.219.55 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.225.73 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కంపెనీ ఆదాయం రూ.12.70 కోట్ల నుంచి రూ.59.39 కోట్లకు పెరిగింది. దేశంలో కొవిడ్-19 తీవ్రత తగ్గి, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో క్రమంగా కార్యకలాపాలను ప్రారంభించనున్నామని కంపెనీ తెలిపింది. 2021 జులై 29 నాటికి దేశంలోని 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, కొలంబో, శ్రీలంక కొన్ని పరిమితులతో థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చాయి.