16 భారత కంపెనీల మందులపై నేపాల్ నిషేధం
చివరికి మన దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు తయారు చేసే మందులు కూడా నాసిరకంగా ఉన్నాయని నేపాల్ నిషేధించింది.
భారత్‌కు చెందిన 16 ఔషధ కంపెనీలను బ్లాక్ లిస్ట్ పెట్టినట్లు నేపాల్ వెల్లడించింది. నేపాల్ నిషేధించిన కంపెనీల జాబితాలో పతంజలి బ్రాండ్‌తో వివిధ రకాల ఔషధాలు, వస్తువులు తయారు చేసే రామ్‌దేవ్ బాబాకు చెందిన దివ్య ఫార్మసీ కూడా ఉండటం విశేషం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ఔషధ తయారీ ప్రమాణాలను పాటించడంలో ఈ కంపెనీలు విఫలమయ్యాయని నేపాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. తక్షణం ఈ సంస్థల ఔషధాలను వెనక్కి పిలిపించాలని, స్థానికంగా పంపిణీ చేసే ఏజెంట్లను ఆదేశించింది. ఇక నుంచి ఈ జాబితాలోని కంపెనీలు తయారు చేసే ఔషధాలను నేపాల్‌లోకి దిగుమతి చేసుకోరు.
నిషేధిత జాబితాలోని కంపెనీలు
దివ్య ఫార్మసీ
రేడియంట్ పేరెంటరల్స్
మెర్క్యురీ లేబొరేటరీస్
అలయన్స్ బయోటెక్
క్యాప్టాబ్ బయోటెక్
అగ్లోమెడ్ లిమిటెడ్
జీ లేబొరేటరీస్
డాఫోడిల్స్ ఫార్మాస్యూటికల్స్
జీఎల్‌ఎస్ ఫార్మా
యూనిజూల్స్ లైఫ్ సైన్స్
కాన్సెప్ట్ ఫార్మాస్యూటికల్స్
శ్రీ ఆనంద్ లాబొరేటరీస్
ఇప్కా ల్యాబరేటర్
క్యాడిలా హెల్త్‌కేర్
డయల్ ఫార్మాస్యూటికల్స్
మాకుర్ లేబొరేటరీస్