For Money

Business News

లాభాల్లో సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. పలు మార్లు నష్టాల్లో జారుకుంది. అయినా చివరికి లాభాల్లో ముగిసినట్లు కన్పించినా.. దాదాపు అవి నామమాత్రమే. నాస్‌డాక్‌ కేవలం 0.01 శాతం లాభపడగా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.10 శాతం లాభపడింది. ఒక్క డౌజోన్స్ మాత్రం స్వల్పంగా అంటే 0.28 శాతం లాభంతో క్లోజైంది. డాలర్‌ ఇండెక్స్ మళ్ళీ 104 దిగువకు పడిపోయింది. రాత్రి బులియన్‌ బ్రహ్మాండమైన లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా సిల్వర్‌ దుమ్ము రేపింది. అలాగే బ్రెంట్‌ క్రూడ్‌ కూడా 80డాలర్లపైనే ఉంది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే జపాన్‌ నిక్కీ స్వల్ప నష్టంతో అంటే 0.14 శాతం నష్టంతో ఉంది. మిగిలిన మార్కెట్లన్నీ లాభాల్లో ఉన్నాయి. అయితే లాభాలన్నీ స్వల్పమే. ఒక్క తైవాన్‌, హాంగ్‌సెంగ్‌ మాత్రమే అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 70 పాయింట్ల లాభంతో ఉంది. సో.. నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది.