For Money

Business News

LEVELS: 18,464 కీలకం

నిఫ్టి క్రితం ముగింపు 18,385. సింగపూర్ నిఫ్టి ఇపుడు 70 పాయింట్ల లాభంతో ఉంది. ఇదే స్థాయి లాభాలతో నిఫ్టి ప్రారంభమైతే ఓపెనింగ్‌లో 18,455 పాయింట్లను దాటనుంది. ఇక్కడే నిఫ్టికి అసలు పరీక్ష ప్రారంభం కానుంది. నిఫ్టి గనుక 18464ను దాటి 15488ని తాకుతుందేమో చూడండి. ఇది అత్యంత కీలక స్థాయి. ఇవాళ మార్కెట్‌ కదలికలతో పాటు రిలయన్స్‌, బ్యాంక్‌ నిఫ్టి కదలికలను గమనించాలని ప్రముఖ డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. అక్టోబర్‌ నెల తరవాత తొలిసారి విదేశీ ఇన్వెస్టర్లకు నికర షార్ట్‌ పొజిషన్‌లో ఉన్నారు. పైగా నిఫ్టి 18500, 18600 వద్ద భారీ కాల్‌ రైటింగ్‌ ఉంది.18500 కాల్ రైటింగ్‌లో నిన్న అదనంగా 15 లక్షల ఓపెన్‌ ఇంటరెస్ట్‌ యాడ్‌ అయింది. కాబట్టి ఈ స్థాయిని దాటడం కష్టంగా కన్పిస్తోంది. దాటితే కూడా 18525 వద్ద గట్టి ప్రతిఘటనకు ఛాన్స్‌ ఉంది. ఈ స్థాయిపైన నిలబడి, నిఫ్టి క్లోజైతే.. మరో లెవల్‌కు నిఫ్టి వెళ్ళగలుగుతుంది. లేదంటే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. అమెరికా ఫ్యూచర్స్‌ను బట్టి ఇవాళ మన మార్కెట్‌ ప్రారంభం అవుతోంది. కాబట్టి ఆ సూచీలు పటిష్ఠంగా నిలబడితే నిఫ్టి కూడా బలంగా ఉంటుంది. లేదా వాటితో పాటు కరుగుతుంది. నిఫ్టి పడితే తొలి మద్దతు 18310 వద్ద లభించనుంది. ఎందుకంటే 18300 పుట్‌ రైటింగ్‌ చాలా జోరుగా ఉంది. దిగువకు వెళ్ళినా కోలుకోవచ్చు. ఎందుకంటే నిన్న 18200 పుట్‌ రైటింగ్‌లో రికార్డు స్థాయిలో 19 లక్షల ఓపెన్‌ ఇంటరెస్ట్‌ యాడ్‌ అయింది. నిఫ్టి 18300 నుంచి 18450 మధ్య ఉండే అవకాశముంది. 18250 దిగువకు వెళితే మాత్రం మరోసారి ఒత్తిడి ఖాయం.