For Money

Business News

యూట్యూబర్లకు రూ.10,000 కోట్ల ఆదాయం

యూ ట్యూబ్‌ క్రియేటర్లు భారత ఆర్థికాభివృద్ధికి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. యూట్యూబ్‌ కంటెంట్‌లు తయారు చేసే  ఈ క్రియేటివ్‌ వ్యవస్థ వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని పేర్కొంది. 2021లో యూట్యూబ్‌ క్రియేటర్లు కంటెంట్‌ ద్వారా రూ. 10,000 కోట్లు సంపాదించారని పేర్కొంది. ఆ మేరకు దేశ జీడీపీలో వీరు తమ వంతు సాయం చేశారని తెలిపింది. ఇదే ఏడాదిలో యూట్యూబ్‌ కోసం కంటెంట్‌ క్రియేటివ్‌ చేయడానికి దాదాపు 7,50,000 పూర్తికాలపు ఉపాధిని పొందినట్లు అధ్యయనం వెల్లడైంది.