జీఎస్టీ కౌన్సిల్: కీలక నిర్ణయాలు వాయిదా
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ శాతం విధించాలన్న అంశంపై ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయంతోపాటు పాన్ మసాలా, గుట్కా తయారీ సంస్థల పన్ను ఎగువేతలను అరికట్టేందుకు ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చ జరగలేదు. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశ వివరాలను కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మీడియాకు వివరించారు. సమయాభావం వల్ల అజెండాలోని 15 అంశాల్లో కేవలం 8 అంశాలను మాత్రమే చర్చించినట్లు ఆయన చెప్పారు. మిగిలిన అంశాలు వచ్చే సమావేశానికి వాయిదా వేసినట్లు తెలిపారు. ఇవాళ్టి సమావేవంలో ఏ వస్తువుపైనా జీఎస్టీని పెంచలేదుని,చాలా వరకు వివిధ అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసినట్లు తెలిపారు. ఎథనాల్‌పై 5 శాతమే జీఎస్టీ వేస్తున్నామని.. ఈ సౌలభ్యాన్ని రిఫైనరీలకు కూడా అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. జీఎస్టీ ఎగవేసే నేరానికి పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వీలున్న మూడు అంశాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అంటే ఆ తరహా నేరాలు పాల్పడినా వారిపై క్రిమినల్ చర్యలు ఉండవు. అలాగే బీమా కంపెనీలు చెల్లించే బోనస్‌పై కూడా జీఎస్టీ ఉండదని వివరణ ఇచ్చినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఇవాళ్టి సమావేవం చాలా వరకు క్లారిఫికేషన్ష్ ఇవ్వడానికే సరిపోయిందని చెప్పారు.