రేంజ్ రోవర్స్పోర్ట్ రెడీ
దేశంలో కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్ డెలివరీని ప్రారంభించినట్టు జాగ్వర్ లాండ్ రోవర్ సంస్థ ప్రకటించింది. టాటా మోటార్స్ అనుబంధంగా ఉన్న ఈ కంపెనీ డైనమిక్ ఎస్ఈ, డైనమిక్ హెచ్ఎస్ఈ, ఆటోబయోగ్రఫి, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లలో మోడల్‌ను అందుబాటులో తెచ్చింది. ఫస్ట్ ఎడిషన్ కేవలం ఒక ఏడాది మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
దేశంలోని 21 నగరాల్లో.. లాండ్ రోవర్‌కు 25 అధికారిక ఔట్లెట్లు ఉన్నాయి. వీటిల్లోంచి ఈ మోడల్‌ను విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. డీ350 డైనమిక్ ఎస్ఈ మోడల్ ధర రూ. 1.64కోట్లు కాగా, పీ400 డైనమిక్ హెచ్ఎస్ఈ ధర రూ. 1.68కోట్లుగా కంపెనీ పేర్కొంది. డీ350 డైనమిక్ హెచ్ఎస్ఈ ధర రూ. 1.71కోట్లు కాగా … డీ350 ఆటోబయోగ్రఫి మోడల్ రూ. 1.81కోట్లకు లభిస్తోంది. డీ350 ఫస్ట్ ఎడిషన్ ధర రూ.1.84కోట్లుగా కంపెనీ పేర్కొంది. ఇవన్నీ ఎక్స్‌షోరూం ధరలు.