అతి పెద్ద ఇన్వెస్టర్‌గా అదానీ కంపెనీ
ఎన్డీటీవీలో 26 శాతం వాటా కోసం అంటే 1.62 కోట్ల షేర్ల కోసం అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్ ఇవాళ ముగిసింది. ఆఫర్‌కు స్పందిస్తూ 53.27 లక్షల షేర్లు వచ్చాయి. ఒక్కో షేర్‌కు రూ.294 మాత్రమే అదానీ ఆఫర్ చేసినా ఈ స్థాయిలో షేర్లు రావడం విశేషం. కాకపోతే వచ్చిన షేర్లలో 39.34 షేర్లు వివిధ కంపెనీలకు చెందినవి. మరి అంత తక్కువ ధరకు ఈ కంపెనీలకు ఎందుకు అమ్మాయో తెలియదు. ఇక రీటైల్ ఇన్వెస్టర్లు ఆఫర్ చేసింది కేవలం ఏడు లక్షల షేర్లు కాగా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మరో 6.86 లక్షల షేర్లు ఇచ్చారు. దీంతో అదానీ చేతికి 53.27 లక్షల షేర్లు లేదా 8.26 శాతం వాటా వచ్చింది. ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ కంపెనీని టేకోవర్ చేయడం ద్వారా అదానీ చేతికి 29.18 శాతం వాటా వచ్చింది. వచ్చిన షేర్రలను అదానీ గ్రూప్ గనుక అంగీకరిస్తే… ఎన్డీటీవీలో వీరి వాటా 37.44 శాతానికి చేరుతుంది. ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ నుంచి బయటకు వచ్చిన తరవాత కూడా ప్రణయ్ రాయ్ దంపతులకు 32.26 శాతం వాటా ఉంది. దీంతో అదానీ కంపెనీ ప్రధాన వాటాదారు కాగా, రెండో స్థానంలో ప్రణయ్ రాయ్ ఉంటారు.