For Money

Business News

10 వేల మందికి ఉద్వాసన!

ఉద్యోగాల తొలగింపు ఇపుడు సిలకాన్‌ వ్యాలీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కరోనా సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను చేర్చుకున్న పెద్ద కంపెనీలు ఇపుడు వారిని తొలగించే పనిలో పడ్డాయి. తాజాగా పది వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు గూగుల్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం మందిని తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ టీమ్‌లోని సభ్యుల హోదా, పనితీరు మెరుగుదలపై నివేదిక పంపాలని మేనేజర్లను అల్ఫాబెట్ కోరిందని వార్తలు వస్తున్నాయి. తొలగింపు వచ్చే ఏడాది ప్రథమ త్రైమాసికంలో ఉంటుందని ది ఇన్ఫర్మేషన్‌ అనే అమెరికన్‌ పత్రిక పేర్కొంది. అయితే కంపెనీపై పలు రకాల కథనాలు మీడియాలో వస్తున్నా ఇప్పటి వరకు అల్ఫాబెట్ నుంచి ప్రకటన లేదు. త్రైమాసిక ఫలితాల్లో మెరుగుదల కనిపించకపోతే చర్యలు తప్పవని కంపెనీ సీఈఓ సుందర్ ఫిచాయ్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే.