నష్టాల్లో SGX NIFTY
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా…నాస్డాక్లో పెద్ద మార్పు లేదు. డౌజోన్స్ 0.6 శాతం.. ఎస్ అండ్ పీ500 సూచీ అర శాతం లాభపడింది.అయితే అమెరికా ఫ్యూచర్స్ ఇపుడు నష్టాల్లో ఉన్నాయి. అలాగే ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా. చైనా సూచీలన్నీ రెండు శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. అలాగే హాంగ్‌సెంగ్ కూడా అంతకన్నా భారీ నష్టాలతో ఉంది. ముఖ్యంగా చైనా మార్కెట్ ప్రభావం మన మార్కెట్‌పై అధికంగా ఉంది.చైనా కరోనా కేసులు సంఖ్యభారీగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో క్రూడ్ భారీగా క్షీణించింది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది.