14 శాతం క్షీణించిన అరబిందో షేర్
తమ కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్/ ప్రమోటర్ గ్రూప్ పి శరత్ చంద్రా రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయాన్ని అరబిందో ఫార్మా ధృవీకరించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. అయితే అరెస్ట్‌కు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని.. తెలిసిన వెంటనే ఎక్స్ఛేంజీకి తెలుపుతామని కంపెనీ తెలిపింది. అలాగే స్టాక్ ఎక్స్ఛేంజీలకు మరో లేఖ కూడా రాసింది. అరబిందో ఫార్మా లేదా దాని అనుబంధ కంపెనీల రోజువారీ కార్యకలాపాలతో శరత్ చంద్రా రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. మరోవైపు శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ వార్తతో ఆరంభంలో ఆరు శాతం దాకా క్షీణించిన షేర్… కంపెనీ వివరణ వచ్చాక 14 శాతం దాకా క్షీణించింది. నిన్న ఎన్ఎస్ఈలో అరబిందో ఫార్మా 541 వద్ద క్లోజ్ కాగా, ఇవాళ రూ. 464ను తాకింది. చివర్లో స్వల్పంగా కోలుకుని 11.56 శాతం నష్టంతో ఈ షేర్ రూ. 478.80 వద్ద ముగిసింది.