NIFTY TRADE: అమ్మే ముందు ఆగండి…
నిఫ్టి ఇవాళ నేరుగా తొలి ప్రతిఘటన స్థాయిలో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,632. సింగపూర్ నిఫ్టి ప్రకారం చూస్తే నిఫ్టి ఇవాళ 15700పైన ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా.. దేశీయంగా అన్నీ నెగిటివ్ అంశాలే కన్పిస్తున్నాయి. అయితే ఇవాళ వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ ఉంది. గత వారం ఫలితాలు ప్రకటించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మూడు నెలల్లో బ్యాంక్ రీటైల్ వ్యాపారం 6 శాతం పెరిగింది. నిన్న ప్రకటించిన బజాజ్ ఫైనాన్స్ ఫలితాలు ఇలాగే ఉన్నాయి. వ్యాపారం లేకపోగా రానిబాకీలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా మూడో త్రైమాసికంలో రూ. 4000 కోట్లకు పైగా ప్రావిజన్ చేయాల్సి వచ్చింది. సో… నిఫ్టి ఇవాళ గనుక 15,700పైన ప్రారంభమైతే.. 15,740 వరకు వస్తుందేమో చూడండి. ఈ స్థాయి దాటితే నిఫ్టి 15,780 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే 15760 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. డే ట్రేడర్స్‌కు అమ్మడానికి ఛాన్స్ ఉంది. ఇవాళ షార్ట్ కవరింగ్‌కు ఛాన్స్ ఉంది కాబట్టి.. నిఫ్టి పెరిగే ఛాన్స్ ఉంది. వెంటనే అమ్మకండి. నిఫ్టిని కొనుగోలు మాత్రం చేయొద్దు. పొజిషనల్ ట్రేడర్స్ కూడా వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే టెన్నికల్‌గా నిఫ్టికి 15,500 ప్రాంతంలోనే కొనుగోలు సంకేతాలు ఉన్నాయి. షార్ట్ కవరింగ్‌కు సెల్ సిగ్నల్స్ ఉన్నాయి. నిఫ్టి పెరిగే వరకు ఆగి… అమ్మి స్వల్ప లాభంతో బయటపడటం మంచిది. పొజిషనల్ ట్రేడర్స్ కొనడానికి వెయిట్ చేయడం మంచిది.