For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

సెలవు తరవాత నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభంతో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా ఒక శాతం దాకా లాభంతో ముగిశాయి. అంతక్రితం యూరప్‌ మార్కెట్లు కూడా రెండు శాతం దాకా లాభపడ్డాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు పరవాలేదనిపిస్తున్నాయి. ఒక్క హాంగ్‌సెంగ్‌ మినహా మిగిలిన సూచీలన్నీ గ్రీన్లో ఉన్నా… లాభాలు నామమాత్రమే. హాంగ్‌సెంగ్‌ 1.87 శాతం లాభంతో ట్రేడవుతోంది. జపాన్‌ మార్కెట్లకు ఇవాళ సెలవు. సింగపూర్‌ నిఫ్టి వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా ఇదే స్థాయిలో లాభాలతో ప్రారంభం అయ్యే అవకాశముంది.