ఉద్యోగుల తొలగింపుతో షేర్ జోరు
మెటాలో 11,000 మంది ఉద్యోగులను తొలగించడాన్ని మార్కెట్ స్వాగతించింది. రాత్రి వాల్‌స్ట్రీట్ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చినా మెటా షేర్ 5 శాతం పైగా పెరిగింది. నాస్‌డాక్ రాత్రి రెండు శాతంపైగా నష్టపోయింది. సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన ఈ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయడం మెటా చరిత్రలో మొదటిసారి. తొలి దశలో 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు జుకర్‌బర్గ్ ప్రకటించారు. కంపెనీలో 13 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపారు.