For Money

Business News

ఆల్‌టైమ్‌ హై వద్ద బ్యాంక్ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు సానకూలంగా ఉండటం… బ్యాంకు షేర్ల రీరేటింగ్ కారణంగా బ్యాంక్‌ నిఫ్టికి మార్కెట్‌లో అనూహ్యంగా మద్దతు లభిస్తోంది.ఇవాళ నిఫ్టి ఆల్ టైమ్‌ హైలో ఓపెన్‌ అయింది. 41939 స్థాయిని ఓపెనింగ్‌లోనే తాకినంది. నిఫ్టి బ్యాంక్‌ మునుపటి ఆల్‌ టైమ్‌ హై 41840. ఈ స్థాయిని ఓపెనింగ్‌లోనే దాటేసింది. ఇపుడు నిఫ్టిలో వెంటనే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ప్రస్తుతం ఈ సూచీ 41805 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే నిఫ్టిలో పొజిషన్‌ ఉన్నవారు 42000 ప్రాంతంలో లాభాలు స్వీకరించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మధ్యాహ్నంలోగా అమ్మకాల ఒత్తిడి రావొచ్చని… మళ్ళీ రీ ఎంట్రీకి అవకాశం లభించవచ్చని అనలిస్టులు సూచిస్తున్నారు.