ఇండియాలో అందర్నీ పీకేశారు
ట్విటర్లో ఉద్యోగులను జెట్ స్పీడ్‌తో తొలగిస్తున్నారు ఆ సంస్థ కొత్త అధినేత ఎలాన్ మస్క్. అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు పడనుందని ఒకవైపు వార్తలు వస్తుండగా… భారత్‌లో మొత్తం స్టాఫ్‌ను తొలగించినట్లు సమాచారం. భారత్‌లో ట్విటర్ కంపెనీలో సుమారు 250 మంది ఉద్యోగులు ఉన్నారని… దాదాపు అందర్ని తొలగించినట్లు తమకు సమాచారం ఉందని మింట్ పత్రిక పేర్కొంది. అంతర్జాతీయంగా ట్విటర్ ఉద్యోగులకు ఇవాళ సాయంత్రం 4 గంటలు హెడ్డాఫీస్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి మా ఆఫీస్ అంతర్గత మెయిల్స్‌తో పాటు ఇతర కమ్యూనికేషన్ మీకు అందుబాటులో ఉండదని ఆ మెయిల్లో పేర్కొన్నారు. కొంత మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత సెప్టెంబర్‌లోనే చాలా మంది ఉద్యోగులను తొలగించారు.