స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
నిన్నటి భారీ అమ్మకాల నుంచి మార్కెట్లు ఇంకా కోలుకోలేదు. నిన్న ఆసియా, యూరో, అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రాత్రి డౌజోన్స్ రెండు శాతంకన్నా అధిక నష్టాలతో ముగిసింది. నిన్న భారీ నష్టాల తరవాత ఇవాళ ఆసియా మార్కెట్లు కాస్త చల్లబడ్డాయి. కాని న్యూజిల్యాండ్ మినహా అన్ని మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. హాంగ్‌సెంగ్ స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. మిగిలిన సూచీలు దాదాపు అర శాతం నష్టాలతో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నందున మార్కెట్లు కోలుకునే అవకాశముంది. సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభం కావొచ్చు.