NIFTY TRADE: దూరంగా ఉండండి
చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు ఇవాళ దూరంగా ఉండటం బెటర్. భారీ నష్టాలతో ప్రారంభం అవుతున్న నిఫ్టి దిగువ స్థాయిలో నిలబడుతుందా లేదా అన్నది టెక్నికల్ అనలిస్టులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే డే ట్రేడింగ్ పరంగా చూస్తే నిఫ్టి బేర్ ట్రెండ్‌లోకి వెళ్ళినట్లు. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని కూడా మార్కెట్ పడినా.. కాస్త కోలుకున్నా తరవాత లాంగ్ పొజిషన్స్ నుంచి బయట పడమని సలహా ఇస్తున్నారు. ఇప్పట్లో పొజిషన్స్…కొనుగోలు లేదా అమ్మకం… తీసుకోవద్దని ఆయన సలహా ఇస్తున్నారు. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నందున వెంటనే ట్రేడ్ చేయడం మంచిది కాదని ఆయన సలహా ఇస్తున్నారు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు .. నిఫ్టి 15,734- ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని..అయితే స్టాప్‌లాస్ 15708. దిగువస్థాయిలో మద్దతు లభించే పక్షంలో తొలుత 15,775, 15825 స్థాయికి చేరే అవకాశముంది. కేవలం రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడ్ చేయండి. సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండండి.