For Money

Business News

భారీ నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభమైంది. 15,735 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి వెంటనే కోలుకుని ఇపుడు 15,778 ప్రాంతానికి చేరింది. ఇపుడు 145 పాయింట్ల నష్టంతో నిఫ్టి ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టంతో ఉండటంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పనితీరు నిరుత్సాహకరంగా ఉండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగా దెబ్బతింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు మొత్తం బ్యాంకింగ్‌ రంగ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యాంక్‌ నిఫ్టి రెండు శాతం దాకా నష్టపోయింది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ 0.8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 43 షేర్లు నష్టాలతో ఉన్నాయి. నిఫ్టి మళ్ళీ 15730 ప్రాంతానికి వస్తే స్వల్ప లాభం కోసం కొనుగోలు చేయొచ్చు. అయితే స్టాప్‌లాస్‌ మర్చిపోవద్దు. ఎందుకంటే యూరో మార్కెట్లలో ఇదే ట్రెండ్‌ కొనసాగితే నిఫ్టి బేర్‌ జోన్‌లోకి వెళ్ళే అవకాశముంది. నిఫ్టికి సంబంధించి పిక్చర్‌ క్లియర్‌ అయ్యే వరకు సాధారణ ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ జోలికి వెళ్ళకపోవడం మంచిది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎన్‌టీపీసీ 120.00 0.76
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,006.40 0.14
టైటాన్‌ 1,697.25 0.11
భారతీ ఎయిర్‌టెల్‌ 541.70 0.10
దివీస్‌ ల్యాబ్‌ 4,761.50 0.08

నిఫ్టి టాప్‌ లూజర్స్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,478.70 -2.87
హెచ్‌డీఎఫ్‌సీ 2,484.55 -2.06
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,026.85 -1.67
ఓఎన్‌జీసీ 114.95 -1.58
టాటా మోటార్స్‌ 306.80 -1.43