For Money

Business News

లాభాల్లో SGX NIFTY.. కానీ

రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండటం, ఫైనాన్సతో ఇతర కంపెనీల ఫలితాలు బాగుండటంతో డౌజోన్స్ లాభాల్లో ముగిసింది. అయితే టెక్‌, ఐటీ షేర్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి ఊపందుకుంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌ (మెటా ప్లాట్‌ఫామ్స్‌) ఫలితాలు మార్కెట్‌ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. షేర్‌ ఏకంగా 25 శాతం క్షీణించింది. ఇతర ఐటీ, టెక్‌ షేర్లు ఆదుకోవడంతో రాత్రి నాస్‌డాక్‌ నష్టాలు 1.63 శాతానికి పరిమితమయ్యాయి. ఎస్‌ అండ్ పీ 500 సూచీ కూడా 0.61 శాతం నష్టంతో ముగిసింది. అంతకుమునుపు యూరో మార్కెట్లలో కూడా అనిశ్చితి కన్పించింది. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.02 శాతం నష్టంతో ముగిసింది. కొన్ని గ్రీన్‌లో, కొన్ని రెడ్‌లో ముగిసినా… మార్పు నామమాత్రమే. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ అర శాతం నష్టపోగా, చైనా మార్కెట్లు ఒక నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ 0.68 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ్టి నుంచి నవంబర్‌ డెరివేటివ్స్‌ ప్రారంభం కానున్నాయి. మార్కెట్‌ ప్రారంభ సమయానికి నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.