3న ఆర్బీఐ కమిటీ అత్యవసర భేటీ
ఆర్బీఐకి చెందిన పరపతతి విధాన కమిటీ (Monetary Policy Committee -MPC) వచ్చేనెల 3వ తేదీన సమావేశం కానుంది. గత సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30 దాకా సాగింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే వడ్డీ రేట్లు పెంచినా ఆర్బీఐ నిర్దేశించిన స్థాయి కంటే అధికంగా ద్రవ్యోల్బణ రేట్లు ఉన్నాయి. దీంతో ధరలను తగ్గించేందుకు ఆర్బీఐ పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఈలోగా ఆర్థిక పరిస్థితిని సమీక్షించేందుకు అదనంగా మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే నెల 3న జరిగే సమావేశంలో ధరలపై అదుపుపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశముంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్బీఐ రెపో రేటును 1.9 శాతం పెంచింది. అయినా వినియోగ వస్తువుల ధరల ఆధారంగా గణించే ద్రవ్యోల్బణం ఈనెల 12వ తేదీన 7.41 శాతంగా నమోదైంది. ఆర్బీఐ లక్ష్యం దిగువన రెండు శాతం లేదా ఎగువన 6 శాతం మించరాదు.