For Money

Business News

బ్రిటన్‌ ప్రధానిగా రిషి.. అధికారిక ప్రకటన

రిషి సునాక్‌ను బ్రిటన్‌ 57వ ప్రధాన మంత్రిగా కింగ్‌ చార్లెస్‌ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం కింగ్‌ చార్లెస్‌ను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో రిషి సునాక్‌ భేటీ అయ్యారు. ఈ భేటీ తరవాత అధికారిక ప్రకటన వెలువడింది. గడచిన 200 ఏళ్ళలో బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా రిషి సునాక్‌ రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకార తేదీ గురించా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈనెల 26న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చినా… 28న ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.