For Money

Business News

26న రిషి సునాక్‌ ప్రమాణస్వీకారం

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఈనెల 26వ తేదీన అంటే ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ జరిగిన కన్సర్వేటివ్‌ పార్టీ సమావేశంలో రిషి సునాక్‌కు తమనేత కన్సర్వేటివ్‌ పార్టీ ఎన్నకుంది. చివరి నిమిషంలో ఆయన ప్రత్యర్థి పెన్ని మోడౌంట్‌ రేసు నుంచి వైదొలగడంతో సునాక్‌ ఎన్నిక ఏక్రగీవంగా మారింది. కన్సర్వేటివ్‌ బ్యాంక్‌ బెంచ్‌ 1922
కమిటీ ఛైర్మన్‌ సర్‌ గ్రామ్‌ బ్రాండీ ఇవాళ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు … కన్సర్వేటివ్‌ పార్టీ నేతగా ఒకే ఒక నామినేషన్‌ వచ్చిందని, సునాక్‌ పార్టీ నేతగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆయన రేపే ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత వార్తలు వచ్చినా… తాజా సమాచారం ప్రకారం బుధవారం ఆయన బ్రిటన్‌ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.