టోకు ద్రవ్యోల్బణం 12 శాతంపైనే…
జూన్ నెలలో కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం 12 శాతం పైన అంటే 12.07 శాతం నమోదైంది. గత నెల మేలో ఈ రేటు 12.97 శాతం ఉండేది. గత డిసెంబర్ నుంచి టోకు ధరలు దేశంలో భారీగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో ఈ సూచీ 4.83 శాతం ఉండగా మార్చిలో 7.89 శాతానికి చేరింది. ఏప్రిల్లో 10.94 శాతం నమోదైంది. వడ్డీరేట్లు 5 శాతం కూడా దాటని సమయంలో ద్రవ్యోల్బణ రేటు 12 శాతంపైన ఉండటం విశేషం. మేలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 4.31 శాతం ఉండగా, జూన్లో 3.09 శాతానికి తగ్గింది. అలాగే పెట్రోల్, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం 37.61 శాతం నుంచి 32.83 శాతానికి తగ్గింది.