నిఫ్టికి అందిన మద్దతు
ఉదయం ఆరంభంలోనే నిఫ్టి ఇవాళ్టి మద్దతు స్థాయికి చేరింది. 15,764 వద్ద నిఫ్టి కోలుకుంది. అక్కడి నుంచి చివరి వరకు గ్రీన్‌లోనే కొనసాగింది. యూరో మార్కెట్లు నామ మాత్రపు నష్టాలకు పరిమితం కావడంతో నిఫ్టి ఇవాళ్టి ప్రధాన అవరోధం 15,877 దాకా వెళ్ళింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 41 పాయింట్లు లాభపడి 15,853 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం ఆశించినట్లు నిఫ్టికి బ్యాంకింగ్ రంగం నుంచి మద్దతు అందలేదు. మైండ్ ట్రీ అద్భుత ఫలితాలతో ఇవాళ ఐటీ షేర్లు వెలుగులో ఉన్నాయి. ఇవాళ ఫలితాలు ప్రకటించనున్న ఇన్ఫోసిస్ రెండు శాతంపైగా లాభంతో ముగిసింది. కంపెనీ ఫలితాలు టీసీఎస్‌కన్నా బాగుంటాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
నిఫ్టి టాప్ గెయినర్స్
విప్రో 561.55 6.99
టెక్ మహీంద్రా 1,077.00 2.56
ఇన్ఫోసిస్ 1,577.40 2.10
హెచ్‌సీఎల్ టెక్ 987.90 2.06
ఎల్ అండ్ టీ 1,540.85 1.80
నిఫ్టి టాప్ లూజర్స్
మారుతీ 7,325.00 -1.42
అదానీ పోర్ట్స్ 696.70 -1.04
హెచ్‌యూఎల్ 2,412.50 -0.99
నెస్లే ఇండియా 17,525.00 -0.94
టైటాన్ 1,709.65 -0.85