ఇవాళ నో ట్రేడింగ్
మార్కెట్ ఒక రేంజ్‌లోనే కదలాడుతున్నందున ఇవాళ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని వెల్లడించారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ… రోజూ నిఫ్టి అధిక స్థాయి ప్రారంభం కావడం, ఆ తరవాత క్షీణించడం లేదా నష్టాలతో ప్రారంభమై కోలుకోవడం… మొత్తంగా నిఫ్టిలో పెద్దగా మార్పులు లేవని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో మార్కెట్‌కు దూరంగా ఉండటమే బెటర్ అని ఆయన అన్నారు. నిఫ్టి బదులు.. ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న కంపెనీలపై దృష్టి కేంద్రీకరించడం మంచిదని ఆయన అన్నారు. మరోవైపు నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందవచ్చని సీఎన్‌బీసీ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అన్నారు. ఇవాళ తీసుకునే పొజిషన్స్‌ను ఇవాళే ముగించమని ఆయన సలహా ఇచ్చారు. ఎందుకంటే రాత్రికి అమెరికా ద్రవ్యోల్బణ డేటా రానుంది. దీని ప్రభావంతో రేపు ఉదయం నిఫ్టి 200 పాయింట్లు పాజిటివ్ లేదా నెగిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన హెచ్చరించారు.