అంచనాలను మించిన టీసీఎస్ పనితీరు
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో కంపెనీ రూ.55,309 కోట్ల ఆదాయంపై రూ. 10,431 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఒక త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 10,000 కోట్లు దాటడం ఇదే మొదటిసారి.గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 18 శాతం పెరగ్గా, నికర లాభం సైతం 8.4 శాతం వృద్ధి చెందింది. జూన్‌తో ముగసిఇన త్రైమాసికంలో ప్రకటిచంఇన రూ.9,478 కోట్లతో పోలిస్తే 10 శాతం పెరిగింది. అయితే కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ మాత్రం 1.6 శాతం తగ్గి 24 శాతానికి చేరింది. ఒక్కో షేర్‌కు రూ.8 చొప్పున రెండో తాత్కాలిక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. రెండో త్రైమాసికంలో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.16 లక్షలకు చేరిందని టీసీఎస్ తెలిపింది. అయినా కంపెనీని వొదలివెళుతున్న ఉద్యోగుల శాతం వార్షిక ప్రాతిపదికన చూస్తే 21.5 శాతానికి చేరినట్లు టీసీఎస్ ప్రకటించింది.