వడ్డీ వేస్తున్నాం… కన్పించడం లేదు అంతే..
ఈపీఎఫ్ సబ్‌స్క్రయిబర్లకు వడ్డీ వేయడంలో కేంద్ర ఆర్థిక శాఖ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందా అన్న అనుమానం కల్గుతోంది. ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్‌లో 6.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. రూ. 15.7 లక్షల కోట్ల నిధులను ఈపీఎఫ్‌ఓ నిర్వహిస్తోంది. కాని ఖాతాదారులకు సకాలంలో వడ్డీ వేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిపై మనీ కంట్రోల్ డాట్ కామ్ ఓ వార్త ప్రచురించింది. తన సబ్‌స్క్రయిబర్లకు 8.5 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ గత ఏడాది మార్చిలో నిర్ణయించింది. 2021 అక్టోబర్‌లో దీన్ని నోటిఫై చేసింది. కాని వడ్డీ జమ చేసింది మాత్రం గత ఏడాది డిసెంబర్‌లో. ఈ ఏడాది వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించారు. జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇప్పటి వరకు తమ ఖాతాల్లో వేయలేదని సబ్‌స్క్రయిబర్లు అంటున్నారు. మన కంట్రోల్ డాట్ కామ్‌లో వచ్చిన వార్తను ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ ట్వీట్ చేశారు. అధికారుల అలసత్వం కారణంగా ఉద్యోగులు ప్రజలు నష్టపోవాలి అని ఆయన ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ స్పందిస్తూ… ఈపీఎఫ్ ఖాతాదారులందరి ఖాతాల్లో ఇంకా వడ్డీ వేస్తున్నామని.. అయితే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం వల్ల సబ్‌స్క్రయిబర్ల ఖాతాల్లో సదరు వడ్డీ కన్పించడం లేదని పేర్కొంది. మరి గత ఏడాది ఎందుకు ఆలస్యం జరిగిందో మరి?